కరోనా టెస్ట్‌లపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్.. !

Thursday, April 1st, 2021, 03:00:12 AM IST


తెలంగాణలో రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది. కోవిడ్ టెస్ట్‌లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీపీసీఆర్ టెస్టులును పెంచాలని, ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్జరీలు అవసరం ఉన్న వాళ్లకు ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని, ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చేవారిలో లక్షణాలుంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాల్సిందేనని ఆదేశించింది వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది.అన్నారు.

అయితే ఆర్టీపీసీఆర్ టెస్టులును పెంచాలని నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తరపున తెలుస్తుంది. . ఇదే సమయంలో రేపటి నుంచి రాష్ట్రంలో 45 ఏళ్లుపైబడిన వాళ్లకు వాక్సినేషన్‌ ప్రారంభం కానున్నట్టు తెలిపారు.. రాష్ట్ర వ్యాప్తంగా 80 లక్షల మంది 45 ఏళ్లు పైబడివారు ఉన్నట్టు గుర్తించామని.. ఇప్పటికే హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు సహా 45 ఏళ్లుపై బడినవారిలో 10 లక్షల మందికి తొలిడోస్ వ్యాక్సిన్ పూర్తిచేసినట్టు వివరించారు. 1000 ప్రభుత్వ, 250 ప్రైవేట్ కేంద్రాల్లో ఇప్పటి వరకు వాక్సినేషన్ సౌకర్యం ఉందని.. కోవిడ్ పెరుగుతున్న నేపథ్యంలో వాక్సినేషన్ ని వేగవంతం, విస్తృతం చేస్తున్నట్టు తెలిపారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు.