తెలంగాణలో ఫస్డ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌కు బ్రేక్‌..!

Saturday, May 8th, 2021, 03:00:42 AM IST

తెలంగాణలో కరోనా కేసులు పెరుగిపోతున్న నేపధ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికి తగినన్ని వ్యాక్సిన్ డోసులు మాత్రం రాష్ట్రానికి అందడం లేదు. దీంతో ఇప్పటికే మొదటి డోస్ తీసుకున్న వారు రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి ఫస్ట్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ను నిలిపివేసింది. రాష్ట్రానికి అవసరానికి తగ్గ మోతాదులో వ్యాక్సిన్లు రాని కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మొదటి డోస్‌కు బ్రేక్‌ ఇచ్చి రెండో డోస్‌ కంప్లీట్‌ చేయాలని భావించిన ప్రభుత్వం మే 15 వరకు ఫస్డ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ నిలిచిపోనుంది. రేపటినుంచి రెండో డోసు వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. ఇక రేపటి నుంచి రెండో డోసు వ్యాక్సిన్ తీసుకునే లబ్ధిదారుల కోసం స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్‌ను చేపట్టబోతున్నారు. ఈ నెల 12వ తేది వరకు రెండో డోసు వ్యాక్సినేషన్ జరగనుండగా, తొలి డోసు తీసుకున్నట్టు సర్టిఫికేట్ చూపిస్తేనే రెండో డోసు టీకా ఇవ్వనున్నారు.