బిగ్ న్యూస్: తెలంగాణలో రేపటి నుంచి స్కూల్స్, కాలేజీలు బంద్..!

Tuesday, March 23rd, 2021, 06:15:51 PM IST

తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. స్కూళ్లు, కాలేజీలలో భారీగా కరోనా కేసులు బయటపడుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్‌ను రేపటి నుంచి తాత్కాలికంగా మూసివేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

అయితే వైద్యకళాశాలలు మినహా మిగతా అన్ని విద్యా సంస్థలకు ఇది వర్తిస్తుందని మంత్రి సబిత స్పష్టం చేశారు. అయితే విద్యాసంస్థలు మూసివేసినా కూడా ఆన్‌లైన్ క్లాసులు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఆమె వెల్లడించారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నాయని రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని మంత్రి సబితా కోరారు.