తెలంగాణ ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల..!

Thursday, January 28th, 2021, 06:19:22 PM IST

Exams

తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేది నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనుంటున్నాయి. ఈ నేపధ్యంలో పరీక్షల షెడ్యూల్‌లను విద్యాశాఖ ప్రకటిస్తూ వస్తుంది. ఇప్పటికే పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన విద్యాశాఖ తాజాగా ఇంటర్మీడియట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది. మే 1 నుంచి మే 19 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు, మే 2 నుంచి మే 20వ తేదీ వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు జరగనున్నాయి.

అయితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉంటే ఏప్రిల్‌ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్స్‌ జరగనుండగా, ఏప్రిల్‌ 1న ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వాల్యూస్‌ పరీక్ష, ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష జరగనుంది. కాగా ఒకేషనల్ కోర్సులకు కూడా ఇదే టైం టేబుల్ వర్తించనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.