తెలంగాణలో సినిమా ధియేటర్లు, మల్లీప్లెక్స్‌కు అనుమతిస్తూ తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ థియేటర్స్ తెరుచుకోడానికి ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు ఇచ్చింది. అయితే టికెట్ల రేట్లను పెంచుకునేందుకు మాత్రం యాజమాన్యాలకే వదిలేసింది. కానీ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
నిబంధనలు ఇవే..!
1) 50 శాతం సిట్టింగ్ కెపాసిటీతో ధియేటర్లను ఓపెన్ చేసుకోవాలి.
2) సిబ్బంది, ప్రేక్షకులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.
3) థియేటర్ ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ దగ్గర కచ్చితంగా శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలి.
4) భౌతిక దూరం ఖచ్చితంగా పాటించాలి, వీలైనంత వరకు ఆన్లైన్ టికెట్స్ ఇవ్వాలి.
5) ప్రతీ షోకు ముందు అన్ని ఏరియాలలో శానిటైజేషన్ తప్పనిసరిగా చేయాలి.
6) థియేటర్లో టెంపరేచర్ 24 నుంచి 30 సెల్సియస్ మధ్య ఉంచాలి.
7) హ్యూమిడిటీ స్థాయి కూడా 40 నుంచి 70 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.
8) రెండు మూడు సినిమాలు ఉండే మాల్స్‌లలో షో టైమింగ్స్ కూడా మార్చాలని, ఒకేసారి రెండు సినిమాలకు ఇంటర్వెల్స్ వస్తే ప్రజలు గుమ్మిగూడే అవకాశాలు ఉంటాయని అది కూడా చూసుకోవాలని సూచించింది.