కొమరం భీం సేవలకు గుర్తింపు

Wednesday, October 8th, 2014, 05:21:46 PM IST


ఆదివాసీ సమర యోధుడు కొమరం భీం పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామని.. కొమరం భీం సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని.. ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. ఈ రోజు ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని జోడేఘాట్ గ్రామాన్ని సందర్శించారు. కొమరం భీం స్వగ్రామం జోడేఘాట్ లో వర్ధంతి వేడుకలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. కొమరం భీం పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వాలు ఆదిలాబాద్ ను పట్టించుకోలేదని.. అందుకే అభివృద్దిలో వెనుకబడి పోయిందని… కెసిఆర్ అన్నారు. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని.. ఆదిలాబాద్ ను అభివృద్ది చేయడమే కాకుండా.. పర్యాటక రంగంలో కాశ్మీర్ ను తలపించే విధంగా అభివృద్ది పరుస్తామని చెప్పారు.

కొమరం భీం గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కొమరం భీం మనవడు, మనమరాలికి ఉద్యోగం ఇస్తామని ఈ సందర్భంగా కెసిఆర్ హామీ ఇచ్చారు. అంతేకాకుండా, ఆ కుటుంబానికి కెసిఆర్ 10లక్షల రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించారు.