తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా.. ఎప్పటివరకంటే?

Tuesday, October 20th, 2020, 06:44:46 PM IST

ఓ పక్క కరోనా, మరో ఓక్క భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల పరీక్షలను దసరా వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వర్షాల సమయంలో పరీక్షలు నిర్వహిస్తే చాలా మంది విద్యార్థులకు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

అయితే ఈ నెల 19 నుంచి 20 వరకు జరిగే పరీక్షలను ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీలు, కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించాల్సిన ఎంబీఏ, డిగ్రీ సెమిస్టర్, బీఈడీ పరీక్షలలను వాయిదా వేసుకున్నాయి. అయితే వాయిదా పడిన పరీక్షలను ఈ నెల 21న నిర్వహిస్తామని ఆయా యూనివర్సీటీలు తెలిపాయి. అయితే రాష్ట్రంలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అన్ని ప్రవేశ పరీక్షలతోపాటు యూజీ, పీజీ, ఇంజినీరింగ్‌ పరీక్షలను మరో మారు వాయిదా వేస్తున్నట్లు మంత్రి సబితా ప్రకటించారు. ఇక ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని ఆమె తెలిపారు.