నేటి నుంచి తెరుచుకోనున్న బార్లు, క్లబ్‌లు.. కండీషన్స్ ఇవే..!

Saturday, September 26th, 2020, 07:41:09 AM IST

తెలంగాణలో నేటి నుంచి బార్‌లు, క్లబ్‌లు, పార్కులు తెరచుకోనున్నాయి. కరోనా కారణంగా మార్చి 22న వైన్‌షాపులతో పాటు బార్‌లు, క్లబ్‌లను మూసివేయించిన ప్రభుత్వం తిరిగి ఆరు నెలల తర్వాత ఇప్పుడు తెరుచుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా గైడ్‌లైన్స్‌ని ఖచ్చితంగా పాటించాలని కొన్ని కండీషన్స్ పెట్టింది.

అయితే బార్‌లు, క్లబ్‌లలో ప్రవేశ ద్వారం వద్ద కస్టమర్లకు థర్మల్‌ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయాలని, లోపలికి వెళ్ళేటప్పుడు తప్పని సరిగా క్యూ పద్ధతి పాటించాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని, శానిటైజర్లు వాడాలని అన్నారు. బార్లలో, క్లబ్బుల్లో ఎక్కువ మంది ఒకే దగ్గర మూగడం, మ్యూజిక్‌ కార్యక్రమాలు, డాన్స్‌ ఫ్లోర్‌లు ఏర్పాటు చేయకూడదని, బార్‌లలో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలని సూచించారు. వైన్‌షాపుల దగ్గర నిర్వహించే పర్మిట్‌ రూమ్‌లకు మాత్రం ఆనుమతి లేదని కోరారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలతో ఇవాళ నుంచి అర్బన్ ఫారెస్ట్ పార్కులు అందుబాటులోకి వస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.