తెలంగాణలో మళ్ళీ మూతపడనున్న స్కూళ్లు.. కేసులు పెరగడమే కారణం..!

Thursday, March 18th, 2021, 12:39:40 AM IST


తెలంగాణలో గతం వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే హైదరాబాద్‌తోపాటు మంచిర్యాల జిల్లాలోని స్కూళ్లు, హాస్టల్స్‌ విద్యార్థులకు కరోనా సోకింది. ఏకంగా 104 మంది విద్యార్థులకు కరోనా సోకినట్టు నిర్థారణ అయ్యింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమయ్యింది. దీనిపై నేడు విద్యాశాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు.

అయితే ప్రస్తుతం రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్కూళ్లు కొనసాగుతున్నాయి. కరోనా నేపథ్యంలో 1 నుంచి 8వ తరగతి వరకు స్కూళ్లను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. 1-8 తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేసే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సీఎం కేసీఆర్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.