ప్రైమరీ స్కూళ్లు తెరిచేది లేదు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

Friday, December 25th, 2020, 09:18:07 AM IST


ఏడాది కాలంగా కరోనాతో వణికిపోతున్న ప్రపంచ దేశాలన్నిటికి మళ్ళీ కరోనా స్ట్రెయిన్ భయం పట్టుకుంది. ఈ కరోనా కొత్త వేరియంట్ యూకే వంటి దేశాలలో విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు అప్రమత్తమయ్యాయి. అయితే యూకే నుంచి మన దేశానికి విమాన రాకపోకలపై నిషేధం విధించినా ఇప్పటికే చాలా మంది అక్కడి నుంచి మన దేశానికి వచ్చినట్టు తెలుస్తుంది. అలా వచ్చిన వారిలో కూడా కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.

ఈ తరుణంలో ప్రైమరీ స్కూళ్ల ప్రారంభంపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రైమరీ స్కూళ్లను తెరవద్దని నిర్ణయించింది. 1 నుంచి 5 తరగతుల వరకు ఈ విద్యా సంవత్సరం మొత్తం క్లాసులు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఇక 6 నుంచి 10వ తరగతి వరకు మరియు జూనియర్ కాలేజీలు సంక్రాంతి తర్వాత తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.