జీహెచ్ఎంసీ పారిశుద్ద్య కార్మికులకు జీతం పెంపు.. ఎంతంటే?

Saturday, November 14th, 2020, 11:32:20 PM IST

దీపావళి సందర్భంగా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మున్సిపల్ సిబ్బంది జీతాన్ని మరో 3 వేలు పెంచుతూ నిర్ణయం వెలువరించింది. ఈ మేరకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. కరోనా కాలంలోనూ హైదరాబాద్‌ నగరంలో పారిశుద్ధ్య కార్మికులు పెద్దఎత్తున ముందుకు వచ్చి సేవలు అందించారని అన్నారు.

అయితే మిగతా మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం పారిశుద్ధ్య కార్మికుల పనితీరే అని అన్నారు. అయితే ప్రస్తుతం 14,500 ఉన్న వారి జీతాన్ని మరో 3 వేలు పెంచి 17,500 చేస్తున్నట్లు ప్రకటించారు. జీహెచ్ఎంసీ కార్మికులకు ఎంత చేసినా తక్కువే అని, ప్రభుత్వ నిర్ణయం కార్మికుల కుటుంబాల్లో సంతోషం నింపుతుదని కేటీఆర్ అన్నారు.