ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరల పట్టిక తప్పనిసరి.. తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు..!

Thursday, August 13th, 2020, 08:15:44 AM IST

తెలంగాణలో కరోనా సంక్షోభం సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు దోపీడికి పాల్పడుతున్నాయని ఎన్నో ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ప్రైవేట్ ఆసుపత్రులకు మంత్రి ఈటెల వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ తరుణంలో అధిక ధరలకు కళ్లెం వేసేందుకు, ప్రైవేట్ ఆస్పత్రులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలని స్పష్టం చేసింది.

కరోనా చికిత్స ఫీజుల వివరాలను ఆసుపత్రిలోని ప్రధాన ప్రదేశాలలో ప్రదర్శించాలని, ట్రీట్‌మెంట్‌ ధరలు, పీపీఈ కిట్లు, ఖరీదైన మందుల ధరలను కూడా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఎమ్మార్పీ ధరకే మందులను అమ్మాలని, రోగులను డిశ్చార్జి చేసే సమయంలో పూర్తి వివరాలతో బిల్లులు ఇవ్వాలని మార్గదర్శకాలలో పేర్కొంది. ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించని ఆసుపత్రులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.