ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త అందించిన తెలంగాణ సర్కార్..!

Monday, January 4th, 2021, 06:24:20 PM IST

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుకగా వేతనాల పెంపును ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించే విషయంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఉద్యోగాలకు పదోన్నతులు కల్పించే ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం కానుంది. జనవరి చివరి నాటికి పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే ప్రభుత్వ నిర్ణయంతో 30 ప్రధాన శాఖలతో పాటు వాటికి అనుసంధానంగా ఉండే మరో 40 ఇతర శాఖల్లో పనిచేసే ఉద్యోగులందరికీ కూడా పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ముందుగా పై స్థాయి ఉద్యోగాల్లో ఖాళీలను పరిగణలోకి తీసుకుని ఆ తర్వాత కిందిస్థాయి ఉద్యోగస్తులకు పదోన్నతలు కల్పించనున్నారు. అయితే ఇప్పటికే ఉద్యోగుల పదోన్నతికి మూడేళ్ల పదవీ కాలాన్ని రెండేళ్లకు తగ్గించాలని సీఎం కేసీఆర్‌ని ఉద్యోగ సంఘాలు కోరగా దానిని కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది.