బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ పొడిగింపు..!

Tuesday, May 18th, 2021, 10:30:45 PM IST

తెలంగాణలో లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నెల 12 నుంచి తెలంగాణ‌లో లాక్‌డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. అయితే తొలుత 10 రోజుల పాటే లాక్‌డౌన్‌ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మరికొన్ని రోజులు లాక్‌డౌన్ అమలుచేస్తే సత్పలితాలు ఉంటాయని భావించింది.

ఈ నేపధ్యంలో నేడు కేబినెట్‌ మంత్రులందరితో ఫోన్‌లో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్న సీఎం కేసీఆర్ ఈ నెల 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. అయితే ఈ నెల 20న జరపాల్సిన కేబినెట్ భేటీని కూడా సీఎం కేసీఆర్ రద్దు చేశారు.