తెలంగాణలో VRO వ్యవస్థ రద్దు.. రేపటి నుంచి రిజిస్ట్రేషన్లు బంద్..!

Monday, September 7th, 2020, 03:47:41 PM IST

తెలంగాణలో పాలన పరంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పెరిగిపోతున్న అవినీతి నిర్మూలించేందుకు రాస్ట్రంలో వీఆర్‌వో వ్యవస్థను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే వీఆర్వోల దగ్గర ఉన్న రికార్డులు మరియు పత్రాలన్నిటిని మ‌‌ధ్యాహ్నం 12 గంట‌ల‌లోగా వారి వారి క‌లెక్ట‌రేట్‌లో అప్ప‌గించాల‌ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

అయితే రికార్డుల సేక‌ర‌ణ ప్ర‌క్రియ మ‌ధ్యాహ్నం 3 గంట‌ల్లోగా పూర్తికావాల‌ని, సాయత్రం 5 గంటల వరకు రికార్డుల స్వాధీనంపై పూర్తి నివేదికలు ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్లకు సూచించారు. అయితే కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఇవాళ మొదలైన శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ రోజు సాయంత్రం జరిగే కేబినెట్ భేటీలో కొత్త రెవెన్యూ చట్టానికి ఆమోదం తెలిపే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రేపటి నుంచి అన్ని రకాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నేటి నుంచే ఈ స్టాంపుల విక్రయం నిలిపివేయగా, చలానాలు చెల్లించిన వారికి ఇవాళ ఒక్కరోజే రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.