తెలంగాణలో విద్యాసంస్థలు తెరిచేందుకు ప్లాన్ రెడీ..!

Thursday, June 10th, 2021, 03:43:35 PM IST


కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా మార్చ్ నెలలోనే విద్యాసంస్థలన్ని మూతపడ్డాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో స్కూళ్లు మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం లేకపోవడంతో పది, ఇంటర్ పరీక్షలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తాజాగా రాష్ట్రంలో విద్యాసంస్థల ప్రారంభానికి ప్లాన్ రెడీ అయ్యింది.

అయితే ఈ నెల 16 నుంచి కొత్త విధ్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. 8 నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు జరగనున్నాయి. గతేడాదిలాగే విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా తగ్గు ముఖం పడితే వచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపిందేకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూలై నెలాఖరు వరకు కరోనా తగ్గు ముఖం పడుతుందని అప్పటివరకు స్కూళ్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.