మందుబాబులకు తెలంగాణ సర్కార్ కిక్కిచ్చే న్యూస్

Wednesday, December 30th, 2020, 04:00:43 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మంది బాబులకు కొక్కిచ్చే న్యూస్ చెప్పింది. న్యూ ఇయర్ కానుక గా రేపు అర్దరాత్రి 12 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి అంటూ ఒక ప్రకటన లో పేర్కొనడం జరిగింది. అయితే మద్యం షాపులతో పాటుగా, క్లబ్బులు, రెస్టారెంట్ లకు అర్దరాత్రి ఒంటిగంట వరకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత ఎక్కువగా ఉండటం, కరోనా వైరస్ స్ట్రెయిన్ కూడా దేశంలోకి చోర బడటం, ఇప్పటికే పలు నిబంధనలు అమలు లో ఉన్నప్పటికి తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల మందుబాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.