ఏపీ ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలి.. జగ్గారెడ్డి కీలక విజ్ఞప్తి..!

Saturday, January 30th, 2021, 03:00:27 AM IST

ఏపీ ప్రజలు మరోసారి కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ణప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా విజయవాడలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెళ్ళారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాధ్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దివంగత మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మూడు ప్రాంతాలను కూడా సమానంగా అభివృద్ధి చేశారని అన్నారు. రాష్ట్రం కలిసి ఉండాలని ముందు నుంచి ఆయన కోరుకున్నారని కానీ ఆయన మరణించాక రాష్ట్రం విడిపోవాల్సి వచ్చిందని జగ్గారెడ్డి అన్నారు. ఏపీలో మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మంచి జరుగుతుందని, రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మొదటి సారి టీడీపీ, రెండవ సారి వైసీపీ అధికారంలోకి వచ్చాయంటే అందుకు కాంగ్రెస్ పార్టీనే కారణమని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు.