తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. ఎవరంటే?

Saturday, September 12th, 2020, 07:29:34 AM IST

జాతీయ కాంగ్రెస్ పార్టీలో మొదలైన అంతర్గత సంక్షోభం కారణంగా ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టింది. పార్టీలో చాలా మంది సీనియర్లకు షాక్ ఇచ్చింది. జనరల్ సెక్రటరీ పదవి నుంచి గులాం నబీ ఆజాద్‌తో పాటు అంబికాసోనీ, మోతీలాల్ ఓరా, మల్లిఖార్జున ఖర్గేను తొలగించింది. అటు యూపీ బాధ్యతలను ప్రియాంకాగాంధీకి అప్పగించింది.

అయితే ఈ నేపధ్యంలో ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆర్సీ కుంతియాను తప్పించి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాగూర్‌కు పగ్గాలు అప్పగించింది. ఈయన కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం అయిన ణ్శూఈలో స్టూడెంట్ లీడర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత ఆల్ ఇండియా ఎన్ఎస్‌యూఐ జనరల్ సెక్రటరీ, ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. అయితే 2009, 2019లో తమిళనాడులోని విరుధానగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక ఏపీ విషయానికి వస్తే ఇన్‌ఛార్జ్ మార్పు జరగలేదు. ఏపీకి కేరళ మాజీ సీఎం ఊమెన్ చాందీనే ఇన్‌ఛార్జ్‌గా కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది.