బిగ్ కన్‌ఫ్యూజన్: జిల్లా పేరును తప్పుగా రాసిన సీఎంవో..!

Tuesday, January 12th, 2021, 01:09:06 AM IST


తెలంగాణ సీఎంవో కార్యాలయం ట్విట్టర్‌లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చానీయాంశమయ్యింది. హరితహారంపై ట్వీట్ చేసిన CMO ఏకంగా ఓ జిల్లా పేరునే తప్పుగా రాసింది. 1.06 కోట్ల మొక్కలు నాటి రాష్ట్రంలో అత్యధిక మొక్కలు నాటిన జిల్లాగా “యాదాద్రి కొత్తగూడెం” నిలిచిందని ఆ జిల్లా కలెక్టర్ ఎం.వి. రెడ్డిని కేసీఆర్ అభినందించినట్టు అందులో పేర్కొంది.

అయితే భద్రాద్రి కొత్తగూడెం అని రాయాల్సింది పోయి యాదాద్రి కొత్తగూడెం అని రాశారు. స్వయంగా సీంవో కార్యాలయం నుంచే ఈ తప్పు రావడంపై నెటిజన్లు పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలు ఏర్పడి నాల్గున్నర ఏళ్లు అవుతున్నా ఇంకా కన్‌ఫ్యూజ్ అవుతున్నారా అంటూ కొందరు సెటైర్లు వేస్తుంటే, మరికొందరు అసలు భద్రాద్రి కొత్తగూడెమా లేక యాదాద్రి భువనగిరినా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.