అస్వస్థతకు గురైన కేసీఆర్.. రద్దైన కార్యక్రమాలు

Saturday, April 16th, 2016, 11:07:46 PM IST


తెలంగాణా సీఎం కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ ను వైద్యులు పరీక్షించి విశ్రాంతి అవసరమని చెప్పడం జరిగింది. దీంతో సీఎం మూడు రోజుల పాటు తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. ఇక సీఎం కేసీఆర్ ఈ మూడు రోజులూ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ విషయాన్ని సీఎం కార్యాలయం అధికారికంగా తెలియజేసినట్లు సమాచారం.