కరోనాను జయించిన సీఎం కేసీఆర్.. RT-PCRలో కూడా నెగెటివ్..!

Wednesday, May 5th, 2021, 12:08:00 AM IST

కరోనా నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా కోలుకున్నారు. గత నెల 19న సీఎం కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కాగా ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే ఇటీవల ఆయనకు వైద్యులు రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. ఈ నేపధ్యంలో నేడు మరోసారి సీఎం కేసీఆర్‌కు కరనా పరీక్షలు నిర్వహించారు. అయితే రాపిడ్ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు రెండింటిలోనూ సీఎం కేసీఆర్‌కు కరోనా నెగిటివ్‌గా రిపోర్టులు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అంతేకాదు ఆయన రక్త పరీక్షల రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వైద్యులు నిర్ధారించారు.