జల వనరుల శాఖపై సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..!

Tuesday, December 29th, 2020, 02:03:02 AM IST


తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జలవనరుల శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణ్యం తీసుకుంది. నేడు జలవనరుల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్ భారీ, మధ్య, చిన్నతరహా నీటిపారుదల విభాగాలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తీసుకు వస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు ఒకే ప్రాంతంలో ఉన్న అన్నిరకాల జలవనరుల శాఖ వ్యవహారాలను ఒకే అధికారి పర్యవేక్షించేలా నిర్ణయం తీసుకున్నారు.

అయితే రాష్ట్రం మొత్తంలో 19 జలవనరుల ప్రాదేశిక ప్రాంతాలుగా గుర్తించి ఒక్కొక్క దానికి ఒక్కో సీఈని పర్యవేక్షణాధికారిగా బాధ్యతలు అప్పగించాలని సీఎం కేసీఅర్ నిర్ణయించారు. ఆరుగురు ఈఎన్సీలను నియమించి వారికి బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుండడంతో ప్రస్తుతం ముగ్గురు ఈఎన్సీలు ఉండగా కొత్తగా మరో మూడు ఈఎన్సీ పోస్టులను భర్తీ చేస్తుంది. పునర్వ్యవస్థీకరణ కారణంగా మొత్తం 945 అదనపు పోస్టులు అవసరం అవుతాయని కూడా ప్రభుత్వం అంచనా వేసింది.