తెలంగాణలో రైతు రాజ్యం వచ్చి తీరుతుంది – సీఎం కేసీఆర్

Saturday, October 31st, 2020, 07:06:22 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జనగామ జిల్లా కొడకండ్లలో మరో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు వేదికలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా రైతులకు వేదికలు లేవని, ఇప్పటి వరకు రైతులకు ఒక వ్యవస్థ అనేది లేదని అన్నారు. అయితే రైతు వేదికలు నా కల అని అన్నారు. రైతులంతా వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రైతులు దేశంలో అగ్రగామిగా నిలవాలన్నదే నా ఆశయమని అన్నారు.

అయితే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ధాన్యం కొనుగోలు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని, రైతుబంధు అనేది నా ప్రాణం ఉన్నంత వరకు ఆగదని అన్నారు. రైతులకు భూమి విషయంలో సంపూర్ణ రక్షణ కావాలనే భూ సర్వే చేయించబోతున్నామని అన్నారు. తెలంగాణలో రైతు రాజ్యం వచ్చి తీరుతుందని అన్నారు. అయితే ఇకపైన మార్కెట్ ఉండే పంటలను మాత్రమే రైతులు సాగు చేయాలని రైతులకు సూచించారు.