కరోనా ప్రభావం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుండడంతో కేంద్రం ఇప్పటికే అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. అయితే స్కూళ్ల పున:ప్రారంభంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలకే పూర్తి అధికారాలు ఇవ్వడంతో దీనిపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా తర్వాతే స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కేబినెట్ సబ్ కమిటీ స్పష్టం చేయడంతో ఇప్పట్లో స్కూళ్లు తెరుచుకునే అవకాశం కనిపించడం లేదు.
అయితే కేరళలో ఓనం పండుగ తర్వాత కరోనా వైరస్ మళ్లీ ఉగ్రరూపం దాల్చిందని అందుకే పండుగల తర్వాత పరిస్థితిని బట్టి పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఇతర విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులు విధివిధానాలను రూపొందించిన తర్వాత దీనిపై సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని మంత్రులు తెలిపారు. అయితే ఉన్నత విద్యాశాఖ పరిధిలోని కాలేజీలు మాత్రం నవంబరు 1 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.