గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం – బీజేపీ

Thursday, December 10th, 2020, 05:30:16 PM IST

జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్ పై దుండగుల దాడి పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఈ ఘటన పట్ల పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దేశంలో బీజేపీ ఎదుగుదల ను, ప్రజల్లో ఉన్న ఆదరణ ను ఓర్వలేక కొంతమంది భౌతిక దాడులకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికి మచ్చ తెస్తున్నారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. బెంగాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారి పై టీఎంసీ గుండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటూ తెలిపింది.

అయితే ఇందుకు సంబంధించిన ఒక వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం జరిగింది. తెలంగాణ బీజేపీ చేసిన వ్యాఖ్యల పట్ల నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు బీజేపీ కి మద్దతు తెలుపుతూ దాడి చేసిన వారి పై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరి కొందరు మాత్రం బీజేపీ పై విమర్శలు చేస్తున్నారు.