మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పిన బీజేపీ..!

Sunday, December 27th, 2020, 06:06:30 PM IST

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలతో ఫుల్ జోష్‌లో ఉన్న బీజేపీ రాష్ట్రంలో మరింత బలపడేందుకు సిద్దమవుతుంది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదను పెట్టిన బీజేపీ, మరో పక్క రాబోయే ఎన్నికలపై కూడా దృష్టి సారించింది. ఈ తరుణంలోనే మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి రాష్ట్ర బీజేపీ మరోసారి కీలక బాధ్యతలు అప్పచెప్పింది.

మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. త్వరలో రానున గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా జితేందర్‌రెడ్డిని నియమిస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఇక స్టార్‌ క్యాంపయినర్‌గా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.