అలా నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా – బండి సంజయ్

Thursday, October 15th, 2020, 03:00:11 AM IST


తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. అయితే నేడు దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్రం సొమ్మును రాష్ట్ర నాయకులు గుంట నక్కల్లా తింటున్నారని ఆరోపించారు.

అయితే ఆయుష్మాన్ భారత్‌ను ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదని అన్నారు. కేంద్రం సొమ్మును రాష్ట్ర నాయకులు గుంట నక్కల్లా తింటున్నారని అన్నారు. అంతేకాదు సంఘాల పేరుతో టృశ్ ఓట్లను చీల్చే ప్రయత్నం చేస్తుందని, అయినా ప్రజా సమస్యలపై గొంతెత్తే నాయకుడికే ప్రజలు ఈ సారి పట్టం కడతారని అన్నారు.