నేటిఏపి స్పెషల్: తెలంగాణలో అత్యల్ప మెజారిటీ సాధించిన అభ్యర్ధులు

Saturday, May 17th, 2014, 04:46:56 PM IST


తెలంగాణ ప్రాంతంలో అన్ని పార్టీలు ఒకదానితో ఒకటి పోటాపోటీగా ఎన్నికల రణరంగంలో పోరాడడంతో భారీ మెజారిటీతో పాటుగా అత్యల్ప మెజారిటీతో కూడా కొన్ని పార్టీలు గెలుపొందాయి. అయితే ఏయే పార్టీల అభ్యర్ధులు కనిష్ట మెజారిటీతో తమ ప్రత్యర్ధులపై చివరిదాకా పోరాడి గెలుపొందారో ఇప్పుడు పరిశీలిద్దాము.

తెలంగాణలో అత్యల్ప మెజారిటీ పొందిన మొదటి ఐదుగురు అభ్యర్ధులు
1. అత్యల్ప మెజారిటీతో గెలుపొందిన వారిలో మొదటగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి కాలెయాదయ్య తన ప్రత్యర్ధి తెరాస నేత కెఎస్ రత్నంపై 781 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
2. రెండవ స్థానంలో మెదక్ జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత గీతారెడ్డి తన ప్రత్యర్ధి తెరాసనేత మాణిక్ రావు పై 814 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
3. మూడవ స్థానంలో ఖమ్మం జిల్లా అశ్వారావుపేట(ఎస్టి) నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత టి వెంకటేశ్వర్లు టిడిపినేత మెచ్చా నాగేశ్వరరావు పై 830 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
4. నాలుగవ స్థానంలో మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలో టిడిపినేత రాజేంద్రరెడ్డి తన సమీప ప్రత్యర్ధి తెరాస నేత శివకుమార్ రెడ్డి పై 2,170 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
5. ఇక ఐదవ స్థానంలో కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం తెరాస అభ్యర్ధి ఎస్ సత్యనారాయణ తన ప్రత్యర్ధి స్వతంత్ర అభ్యర్ధి అయిన కోరుకంటి చందర్ పై 2,295 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

అయితే అత్యధిక మరియు అత్యల్ప మెజారిటీతో గెలిపొందిన అభ్యర్ధులలో ఐదవ స్థానం పొందిన ఇద్దరు కరీంనగర్ జిల్లాకు చెందిన వారు అవ్వడం విశేషం. మరి ఈ ఎన్నికలలో ఎంత భారీ మెజారిటీతో అభ్యర్ధులు గెలిచారో అంతే అత్యంత స్వల్ప మెజారిటీతో కూడా అభ్యర్ధులు గెలుపొందారు. అయితే ఒక్క ఓటు తేడా ఉన్నా గెలుపు గెలుపే గనుక ఈ ఎన్నికలలో గెలిచిన వారందరికీ మెజారిటీతో సంబంధం లేకుండా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలుపుదాం.