మంత్రి కేటీఆర్‌ను ఉరితీయాలి.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు..!

Sunday, March 28th, 2021, 12:41:33 AM IST

తెలంగాణ వచ్చి ఏడేళ్ళు పూర్తైనా ఉద్యోగాలు రావడం లేదని కాకతీయ యూనివర్సిటీ సాక్షిగా మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం గుండేంగ తేజవత్‌రామ్‌సింగ్‌ తండాకు చెందిన కేయూ విద్యార్థి బోడ సునీల్‌నాయక్‌ పురుగుల ముందు తాగి నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్నేహితులు వెంటనే సునీల్‌ను వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఎంజీఎంలో చికిత్స పొందుతున్న సునీల్‌నాయక్‌ను తీన్మార్ మల్లన్న పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అయితే విద్యార్థులకు ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో దాపురించందంటే నిజంగా బాధగా ఉందని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుందని విద్యార్థులకు ఉద్యోగాలు రావాలంటే ముందుగా కేసీఆర్ ఉద్యోగం పోవాలని అన్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేసిన మంత్రి కేటీఆర్‌ను హన్మకొండ చౌరస్తాలో ఉరితీయాలని అన్నారు. కేసీఆర్ అరాచక పాలనను బొంద పెట్టే వరకు వందశాతం మేము విశ్రమించమని అన్నారు. ఇక నిరుద్యోగ సోదరులారా ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకండని, త్వరలోనే మంచి రోజులు వస్తాయని మల్లన్న అన్నారు.