మంత్రి ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరుగుతుంది.. తీన్మార్ మల్లన్న కామెంట్స్..!

Wednesday, March 24th, 2021, 10:23:14 PM IST


తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఈటలకు అన్యాయం జరుగుతుందన్న మాట వాస్తవమేనని, ఎటలకు జరుగుతోన్న అన్యాయాన్ని గతంలోనే తాను ఖండించినట్టు తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనకు లక్ష ఓట్లు వేయిస్తే, బీజేపీ అభ్యర్థికి ఎందుకు ఓట్లు వేయించలేకపోయారని ప్రశ్నించారు. మా ఇద్దరిది ఒకే కులమైనా నా సిద్ధాంతాలు, బండి సంజయ్ సిద్ధాంతాలు వేరని దయచేసి తనపై కులముద్ర వేయొద్దని అన్నారు.

అయితే అసెంబ్లీ అంటే తెలియని వారిని నాతో పాటు అసెంబ్లీ గడప తొక్కిస్తానని, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా 6వేల కిలోమీటర్ల పాదయాత్ర చేయబోతున్నట్టు మల్లన్న తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల డబ్బులు నాకు అవసరం లేదని, నాకు ప్రజలే ఓట్లు, నోట్లు ఇచ్చారని అన్నారు. నా అనుచరులు ఒక్క రోజు టీ తాగకుంటే 5 కోట్లు జమ అవుతాయని అన్నారు. బీజేపీ నేతలు తనను పార్టీలో చేరమని అడిగారని, బీజేపీనే కాదు ఏ పార్టీలోను తాను చేరే ప్రసస్తే లేదని క్లారిటీ ఇచ్చారు. నాగార్జునసాగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఓడించాలని సాగర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.