కేసీఆర్ పై తీన్మార్ మల్లన్న ఊహించని సెటైర్లు..!

Wednesday, July 8th, 2020, 09:24:55 AM IST

ఒకప్పుడు తెలంగాణాలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఎలా ఉన్నాయి? అన్నది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు క్రిస్టల్ క్లియర్ గా స్పష్టం అయ్యిందని చెప్పాలి. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహారం ఒక్క మాటలకు మాత్రమే పరిమితం కావడం పైపెచ్చు ఇప్పుడు ఎవరికి కనిపించకుండా పోవడంతో సోషల్ మీడియాలో కేసీఆర్ విషయంపై పెద్ద రచ్చే నడుస్తుంది అని చెప్పాలి.

ముఖ్యంగా కేసీఆర్ కనిపించడం లేదని వస్తున్న సెటైర్లు అయితే అన్ని ఇన్ని కావు. తెలంగాణ లో మోస్ట్ పాపులర్ అయిన స్మాల్ స్క్రీన్ వ్యక్తులలో వార్తలు చెప్పే తీన్మార్ మల్లన్న కూడా ఒకరు. అతను తన సోషల్ మీడియా ద్వారా పెట్టిన పోస్ట్ కేసీఆర్ పై మోస్ట్ సెటైరికల్ గా ఉందని చెప్పాలి.

ఎవరో చిన్న పిల్లాడు తప్పిపోతే అతని ఫోటో వేసి ఎలా అయితే ప్రకటన ఇస్తారో అదే విధంగా కేసీఆర్ ఫోటోను చిన్ననాటి ఫోటోలా ఎడిట్ చేసి ఓ పోస్ట్ పెట్టారు.”……….కనబడుటలేదు…….. బాబు మేము నిన్ను ఏమనం హైదరాబాద్ రా…బాబు నువు కనబడక . ఏమైందో అని బెంగా తో చుక్క.ముక్క.. ముడుతలేరు… ఇట్లు … నీ అభిమానులు.” అంటూ వేరే లెవెల్ సెటైర్ వేశారు.