హైవేపై ఆగిపోయిన చంద్రబాబు కాన్వాయ్.. 20 నిమిషాలు రోడ్డుపైనే..!

Friday, November 13th, 2020, 08:14:59 PM IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కారులో సాంకేతిక లోపం తలెత్తింది. అమరావతి నుంచి హైదరాబాద్ వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలో ఈ సమస్య తలెత్తింది. క్లచ్‌ ప్లేట్లలో లోపం తలెత్తినట్లు గుర్తించిన డ్రైవర్‌ వాహనాన్ని వెంటనే నిలిపివేశారు. అయితే కారును బాగు చేసేందుకు సిబ్బంది 20 నిమిషాల పాటు ప్రయత్నించారు.

అయితే కారు బాగయ్యేందుకు ఇంకా సమయం తీసుకునే అవకాశం కనిపించడంతో మరో బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లారు. ఇదిలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు ప్రయాణించే ప్రధాన వాహనం 60 వేల కిలోమీటర్లకు పైగా తిరిగింది. ఈ కారణంగానే వాహనంలో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తుంది.