టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

Thursday, December 17th, 2020, 10:25:24 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత్ నేటినుంచి టెస్ట్ సీరీస్ ను ఆడనుంది. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. అయితే అడిలైడ్ వేదిక గా జరుగుతున్న ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చెందుకు సిద్దం అయింది. కాగా పరుగుల ఖాతా తెరవకుండా నే భారత్ తొలి వికెట్ ను కోల్పోయింది. పృథ్వీ షా ఓపెనర్ గా రావడం, రెండవ బంతికి ఔట్ అవ్వడం అభిమానులను నిరాశకి గురి చేసింది. ఇప్పుడు పుజారా రాగా, మయాంక్ అగర్వాల్ తో కలిసి బ్యాటింగ్ చేస్తున్నాడు.

అయితే ఈ టెస్ట్ సీరీస్ లో స్టార్ బ్యాట్స్ మన్ గాయాల భారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. అయితే విరాట్, పుజారా, రహానే లు రాణిస్తే ఈ మ్యాచ్ పై పట్టు సాధించే అవకాశం ఉందని తెలుస్తోంది.