ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా…2-0 తో సీరీస్ కైవసం

Sunday, December 6th, 2020, 06:22:51 PM IST

ఆస్ట్రేలియా తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. అయితే మూడు టీ 20 మ్యాచ్ ల సీరీస్ లో ఇప్పటికే ఒక మ్యాచ్ లో గెలిచిన టీమ్ ఇండియా, నేడు రెండవ మ్యాచ్ లో గెలిచి, ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సీరీస్ సొంతం చేసుకుంది. ఆసీస్ 20 ఓవర్ లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. 195 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా, 19.4 ఓవర్ లలో నాలుగు వికెట్లను కోల్పోయి విజయం సాధించింది. అయితే వన్డే సీరీస్ ను చేజార్చుకున్న టీమ్ ఇండియా, దానికి ప్రతీకారంగా ఆస్ట్రేలియా పై ప్రతీకారం తీర్చుకుంది.

అయితే శిఖర్ ధావన్ 36 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్స్ లతో కలిపి 52 పరుగులు చేయగా, కే. ఎల్ రాహుల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ తో 30 పరుగులు సాధించాడు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 24 బంతుల్లో 40 పరుగులు చేయగా, చివరగా వచ్చిన హర్దీక్ పాండ్య 22 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్స్ లతో 42 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ సైతం 12 పరుగులు చేసి జట్టు విజయం లో కీలక పాత్ర పోషించారు. ఈ సీరీస్ విజయం సొంతం చేసుకోవడం పట్ల మరొకసారి టీమ్ ఇండియా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అభిమానులు సైతం ఈ విజయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.