ఆసీస్ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్డ్…టీమ్ ఇండియా భారీ టార్గెట్!

Sunday, January 10th, 2021, 11:52:49 AM IST

ఆసీస్ పర్యటన లో ఉన్న భారత్ టెస్ట్ సీరీస్ లో ఆడుతున్న సంగతి తెలిసిందే. మూడవ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ ను 312/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 94 పరుగుల ఆధిక్యం మరియు రెండవ ఇన్నింగ్స్ తో కలిపి టీమ్ ఇండియా కి భారీ టార్గెట్ ను సెట్ చేసింది. 407 పరుగులు లక్ష్యం తో బరిలోకి దిగిన టీమ్ ఇండియా ప్రస్తుతం 71 పరుగుల వద్ద వికెట్ కోల్పోయింది. శుభమన్ గిల్ 31 పరుగులు చేసి హేజిల్ ఉడ్ చేతిలో ఔట్ అయ్యాడు. పుజారా క్రీజులో కి రాగా, రోహిత్ శర్మ 39 పరుగుల చేశాడు. ప్రస్తుతం నిలకడగా రాణిస్తున్నాడు.