స్టీవ్ స్మిత్ మరో శతకం…టీమిండియా టార్గెట్ 390 పరుగులు

Sunday, November 29th, 2020, 02:06:50 PM IST

భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియా మరొకసారి భారీ గా పరుగులు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్ లలో నాలుగు వికెట్ లను కోల్పోయి 389 పరుగులు సాధించింది. స్టీవ్ స్మిత్ మరొకసారి శతకం సాధించాడు. 64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్ లను బాది 104 పరుగులు చేశాడు. మరొక వైపు డేవిడ్ వార్నర్ 77 బంతుల్లో 83 పరుగులు చేయగా, ఆరోన్ ఫించ్ 60, మార్నస్ లబుషేన్ 70 పరుగులు చేయడం తో ఆస్ట్రేలియా 389 పరుగులు చేసింది. అయితే వరుసగా స్టీవ్ స్మిత్ రెండవ సెంచరీ సాధించడం తో తన కెరీర్ లో 11 వ సెంచరీ నమోదు చేశాడు. అయితే భారత్ పై ఇది ఐడవది కాగా, టీమిండియా పై ఐదు శతకాలు బాదిన ఆటగాడిగా, రికి పాంటింగ్ తర్వాత నిలిచాడు.

అయితే స్టీవ్ స్మిత్ విద్వంసం తో భారత్ మరోమారు తన ప్రదర్శన తో ఆకట్టుకోలేక పోయింది. అయితే భారత్ బ్యాట్స్ మన్ పైన ఇక మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.అయితే మూడు వన్డే మ్యాచ్ ల తో ఉన్న ఈ సీరీస్ లో ఇప్పటికే ఒక మ్యాచ్ గెలిచి ఆస్ట్రేలియా ముందంజ లో ఉండగా, భారత్ తప్పక గెలవాల్సిన పరిస్తితి ఉంది. మరి భారత్ ఈ భారీ లక్ష్యాన్ని చేదిస్తుందో లేదో చూడాలి.