చెన్నై టెస్ట్:టీమ్ ఇండియా కి తప్పని ఓటమి… ఇంగ్లాండ్ ఘన విజయం!

Tuesday, February 9th, 2021, 02:37:04 PM IST

చెన్నై వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో 227 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది. 420 పరుగుల లక్ష్యం తో రెండవ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన భారత్ చేదన లో 192 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. ఇంగ్లాండ్ కి చెందిన అండర్సన్ మూడు వికెట్లు మరియు లీచ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లాండ్ భారీ విజయం లో కీలక పాత్ర పోషించారు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్మెన్ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లి 72 పరుగులు చేయగా, సుభమన్ గిల్ 50 పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో భారత్ టాప్ ఆర్డర్ అంతగా రానించకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 178 పరుగులకు ఆల్ ఔట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.