ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కి జట్టును ప్రకటించిన బీసీసీఐ

Friday, March 19th, 2021, 01:59:57 PM IST

ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ చాలా కీలక కానుంది. అయితే తాజాగా బీసీసీఐ ఇంగ్లాండ్ తో జరగబోయే వన్డే సిరీస్ కొరకు 18 సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లి సారథ్యం లో టీ 20 సీరీస్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సీరీస్ అనంతరం వన్డే సిరీస్ ఆడనుంది. మార్చి 23 వ తేదీ నుండి భారత్ ఇంగ్లాండ్ మధ్యలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ కి వన్డే సిరీస్ లో చోటు దక్కింది. అతనితో పాటుగా ప్రసిద్ది కృష్ణా, కృణల్ పాండ్య లను బీసీసీఐ సెలెక్ట్ చేసింది. అయితే టీమ్ ఇండియా ఆడిన రెండు వన్డే సిరీస్ లు కూడా ఓటమి పాలు అయింది. అయితే ఈ సీరీస్ ఎలా ముగుస్తుంది అనే దాని పై ఆసక్తి నెలకొంది.

అయితే కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం 2019 ఆగస్టు తర్వాత నుండి వన్డే సిరీస్ లో ఒక్క సెంచరీ కూడా సాధించలేదు. అతనితో పాటుగా టీమ్ ఇండియా లో కీలకం అయిన పంత్, సూర్య కుమార్ యాదవ్, రోహిత్, భువనేశ్వర్ కుమార్, చాహల్, హర్దిక్ పాండ్య ల పెర్ఫార్మెన్స్ కీలకం కానుంది. అయితే ప్రస్తుతం వన్డే సిరీస్ కొరకు బీసీసీఐ ప్రకటించిన జట్టు లో కెప్టన్ గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, సుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, హార్డిక్ పాండ్య, రిశబ్ పంత్, రాహుల్, చహల్, కుల్దీప్ యాదవ్, క్రునాల్ పాండ్య, వాషింగ్ టన్ సుందర్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, సిరాజ్, ప్రసిడ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ లు ఉన్నారు.