టీమిండియా తొలి ఇన్నింగ్స్ 336 కి అలౌట్..!

Sunday, January 17th, 2021, 03:53:55 PM IST

ఆసీస్ టూర్ లో ఉన్న భారత్ ప్రస్తుతం టెస్ట్ సీరీస్ ఆడుతుంది. అయితే అన్ని ఫార్మాట్ లలో నిలకడగా రాణిస్తున్న భారత్, మూడవ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో 336 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కి ధీటుగా బదులు ఇచ్చింది. అయితే మూడవ రోజు టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్స్ 336 కి ఆలౌట్ అవ్వడం తో ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్ ను ప్రారంబించింది. మూడవ రోజు ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 21 పరుగులు చేసింది. ప్రస్తుతం వార్నర్ 20 పరుగులు, హారిస్ ఒక పరుగు చేసి క్రీజు లో ఉన్నారు.

అయితే మూడవ రోజు భారత్ 62/2 తో ఆదివారం నాడు ఆటను మొదలు పెట్టింది. 105 పరుగుల వద్ద పుజారా (25) ఔట్ కాగా,రహానే 37 పరుగులు, మయాంక్ 38 పరుగులు చేసి ఔట్ అయ్యారు. అయితే భారత్ తొలి సెషన్ పూర్తి అయ్యే సరికి 161 పరుగులు చేసి నాలుగు వికెట్ లను కోల్పోయింది. అయితే టీమ్ ఇండియా లో చివరగా వాషింగ్టన్ సుందర్ మరియు శార్దూల్ టాకుర్ రాణించడం తో టీమ్ ఇండియా మెరుగైన స్కోర్ చేయగలిగింది. సుందర్ 62 పరుగులు చేయగా, ఠాకూర్ 67 పరుగులు చేశాడు. అయితే వీరి ప్రదర్శన పై మాజీ ఆటగాళ్ళు, టీమ్ ఇండియా ప్లేయర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.