51 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన కోహ్లీ… మరో అరుదైన రికార్డు!

Friday, December 18th, 2020, 11:50:22 AM IST

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ను రన్నింగ్ మిషన్ అని పిలవడం లో ఎలాంటి సందేహం లేదు. కెప్టెన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విరాట్ కోహ్లీ. అయితే మరో అరుదైన రికార్డు ను విరాట్ కోహ్లీ సొంతం చేసుకున్నారు. అడిలైడ్ వేదిక గా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 74 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా పై అత్యధికం గా టెస్ట్ మ్యాచ్లలలో ఎక్కువ పరుగులు సాధించిన కెప్టెన్ గా రికార్డ్ సృష్టించడం జరిగింది. అయితే ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి 51 ఏళ్ల సమయం పట్టింది.

ఆస్ట్రేలియా పై ఇప్పటి వరకూ ఎక్కువ పరుగులు చేసిన కెప్టెన్ గా మాజీ ప్లేయర్ ఎం ఎ కే పటౌడి పేరిట ఉంది. అయితే 40 టెస్ట్ మ్యాచ్ లకి కెప్టెన్ గా వ్యవహరించిన పటౌడీ 829 పరుగులు చేయగా, కోహ్లీ 10 టెస్టులకు నాయకత్వం వహించి 851 పరుగులు చేశాడు. అయితే తొలి టెస్ట్ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ భారత్ 244 పరుగులకు అలౌట్ అయిన సంగతి తెలిసిందే.