సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ సృష్టించిన విరాట్

Tuesday, March 2nd, 2021, 12:40:47 PM IST

టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి సోషల్ మీడియా లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇప్పటి వరకూ ఏ క్రికెటర్ చేరుకొని రికార్డ్ ను అందుకున్నాడు. అయితే ప్రొఫెషనల్ క్రికెట్ కు చెందిన విషయం కాకుండా, వ్యక్తిగతం గా ఈ రికార్డ్ ను నెలకొల్పడం అభిమానులందరికీ కూడా సంతోషాన్ని కలిగిస్తోంది. విరాట్ కోహ్లీ కి ఇన్ స్టాగ్రం లో పది కోట్ల మంది ఫాలోవర్ లను సంపాదించుకున్నారు. ఇప్పటి వరకూ ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా విరాట్ నిలిచాడు. అంతేకాక ఆసియా లోనే ఎక్కువ మంది ఫాలోవర్ల ను కలిగిన సెలబ్రిటీ గా విరాట్ తన పేరు లిఖించుకున్నాడు.

అయితే ఫుట్ బాల్ దిగ్గజాలు అయిన క్రిస్టియానో రోనాల్డో, లియోనల్ మెస్సీ లకు సోషల్ మీడియా లో అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నారు. రోనాల్డో కి 26.6 కోట్ల ఫాలోవర్లు ఉండగా, మెస్సీ కి 18.7 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇండియా లో విపరీతమైన క్రేజ్ ఉన్న మహేంద్ర సింగ్ ధోనీ కి 3.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం పట్ల సర్వత్రా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.