చెన్నై టెస్ట్: లంచ్ బ్రేక్ కి టీమిండియా 144/6

Tuesday, February 9th, 2021, 12:32:11 PM IST

భారీ పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమం లో టీమ్ ఇండియా వరుస వికెట్లను చేజార్చుకుంది. లంచ్ బ్రేక్ కి టీమ్ ఇండియా 144 పరుగులు చేసి, ఆరు వికెట్లు కోల్పోయంది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ 45 పరుగులతో, అశ్విన్ 2 పరుగుల తో ఉన్నారు. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో భారత్ గెలిచే అవకాశం తక్కువగా ఉంది. మ్యాచ్ ను ఇక డ్రా చేసేందుకు టీమ్ ఇండియా నిలదొక్కుకోవడం కి చూస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 39/1 స్కోర్ తో టీమ్ ఇండియా మంగళవారం నాడు ఐదో రోజు ఆటను ప్రారంబించింది. తొలి సెషన్ లో ఐదు వికెట్ లను కోల్పోయి 105 పరుగులు చేసింది. అండర్సన్ మూడు వికెట్ లు తీయగా, లీచ్ మరియు బెస్ లు తలో వికెట్ తీశారు. పుజారా, రహానే, పంత్, వాషింగ్ టన్ సుందర్ పూర్తి గా విఫలం అయ్యారు. భారత్ ఈ మ్యాచ్ ను గెలవాలి అంటే ఇంకా 276 పరుగులు చేయాలి, ఇంగ్లాండ్ గెలుపుకు ఇంకా నాలుగు వికెట్ల దూరం లో ఉంది.