స్టీల్ ప్లాంట్ భూములను బినామీలకు కట్టబెట్టే రహస్య అజెండా – యనమల

Friday, February 19th, 2021, 12:39:19 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో నీ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ విషయం లో అధికార పార్టీ పై ప్రతి పక్ష తెలుగు దేశం పార్టీ వరుస విమర్శలు గుప్పిస్తుంది. ఈ మేరకు శాసన మండలి సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని తన చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా అమ్మించి బినామీల పరం చేయాలన్నది జగన్నాటకం అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్టీల్ ప్లాంట్ భూములను బినామీలకు కట్టబెట్టే రహస్య అజెండా తొలి అంకం లో భాగం గానే ప్రధాని నరేంద్ర మోడీ కి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు అంటూ చెప్పుకొచ్చారు.

అయితే ఏ1 జగన్, ఏ2 విజయసాయి రెడ్డి కుట్ర లో సూత్రధారులు అయితే పాత్రధారులు అరబిందో, హెటిరో అంటూ యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అయితే కాకినాడ సెజ్, బే పార్క్ భూములను ఇప్పటికే హస్తగతం చేసుకున్నారు అని, తొలుత విశాఖ భూములు, ఆశ్రమ భూముల పై గద్దల్లా వాలి, ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పై కన్నేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటలను బట్టి పోస్కో తో ఒప్పందం నిజమేనని తెలుస్తోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్మిక సంఘాలు తమ ఉద్యమం లో సీఎం జగన్ భాగం కావాలని అనుకుంటే, జగన్ మాత్రం యాగం కి వెళ్ళడం ఎంతవరకు సబబు అంటూ సూటిగా ప్రశ్నించారు. యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు సర్వత్రా హాట్ టాపిక్ గా మారింది.