తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి

Thursday, March 18th, 2021, 02:27:29 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎంతో ఉత్కంఠ కి గురి చేసిన అనంతపురం తాడిపత్రి మునిసిపాలిటి తెలుగు దేశం పార్టీ కైవసం అయింది. పురపాలక చైర్మన్ గా తెలుగు దేశం పార్టీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా సరస్వతి ను ఎన్నుకొన్నారు. అయితే చైర్మన్ పీఠం కోసం అదికార ప్రతి పక్ష పార్టీ లు శిబిరాలు కూడా ఎర్పాటు చేయడం గమనార్హం. తాడిపత్రి లో 36 వార్డ్ లకు గానూ రెండు వైసీపీ కి ఏకగ్రీవాలు కాగా,మిగతా 34 వార్డులకు ఎన్నికలు జరిగాయి. అందులో టీడీపీ 18, వైసీపీ 14 గెలవగా సీపీ ఐ మరియు స్వతంత్ర అభ్యర్థులు తలా ఒకటి గెలిచారు. అయితే వీరు సైతం టీడీపీ కి మద్దతు గా ఉన్న సంగతి తెలిసిందే.