జగన్ ఈసారి “ఫ్యాన్” తో పాటు తాడు కూడా ఇచ్చారట.!

Sunday, August 2nd, 2020, 04:27:06 PM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో మూడు రాజధానుల రగడ తారా స్థాయిలో ఉంది. జగన్ పై టీడీపీ శ్రేణులు టీడీపీపై జగన్ శ్రేణులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. అమరావతి రైతులను జగన్ మోసం చేసారని టీడీపీ కాదు చంద్రబాబే మోసం చేసారని జనసేన శ్రేణులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటుండగా..

టీడీపీ మాత్రం జగన్ పై కార్టూన్స్ తో అతను అమరావతి రైతులను ఎలా మోసం చేశారు అని సెటైర్స్ వేస్తున్నారు. జగన్ ఎన్నికల ముందు గాలి వీస్తున్న ఫ్యాన్ ను చూపించి రాజధానిగా అమరావతినే ఉంచుతానని చెప్పి ఇప్పుడు తీరా ఎన్నికలు పూర్తయ్యాక మాత్రం ఆగిపోయిన ఫ్యాన్ ను ఇచ్చి దానితో పాటు అమరావతి రైతులు ఆత్మహత్య చేసుకోడానికి తాడు కూడా ఇస్తున్నాడని పోస్టు చేసారు. అలాగే ఇదే జగన్ తాలూకా అసలు రంగు అంటూ పోస్ట్ చేసారు. మరి దీనికి వైసీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.