స్టింగ్ ఆపరేషన్: వైసీపీ ప‌న్నిన కుట్ర‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేసిన టీడీపీ..!

Thursday, March 25th, 2021, 03:26:39 PM IST

ఏపీ అధికార పార్టీ వైసీపీ అమరావతిపై పన్నిన కుట్రను టీడీపీ బట్టబయలు చేసింది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే అళ్ల రామకృష్ణా రెడ్డి అసైన్డ్ రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చార‌ని రైతులే చెబుతున్న వీడియోను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు నిజ‌మేంటో జ‌నానికి తెలిసేస‌రికి, జ‌గ‌న్‌రెడ్డి సృష్టించిన అబ‌ద్ధాలు ప్ర‌పంచం చుట్టి వ‌స్తున్నాయని, అస‌త్య‌ప్ర‌చారమే పెట్టుబ‌డిగా తెచ్చుకున్న‌ అధికారం అండ‌తో అమ‌రావ‌తిపై ప‌న్నిన మ‌రో కుట్ర‌ని తెలుగుదేశం బ‌ట్ట‌బ‌య‌లు చేసిందని లోకేశ్ అన్నారు.

అయితే ఫేక్ సీఎం ఆదేశాల‌తో, ఫేక్ ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చార‌ని ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టామని, ఇప్ప‌టికైనా ప్ర‌జారాజ‌ధాని అమ‌రావ‌తిపైనా, టీడీపీపైనా కుతంత్రాలు ఆపండని అన్నారు. అంద‌రి ఆమోదంతో, రైతుల త్యాగాల పునాదుల‌పై నిలిచిన ప్ర‌జారాజ‌ధానిపై విద్వేషంతో అమ‌రావ‌తి విధ్వంసానికి ప్ర‌య‌త్నించిన‌ ప్ర‌తీసారీ న్యాయ‌మే గెలుస్తుందని, నీ అస‌త్య‌పు కుట్ర‌లు బ‌ట్ట‌బ‌య‌ల‌వుతూనే ఉంటాయని సీఎం జగన్‌ని లోకేశ్ హెచ్చరించారు.