జనసేన వాళ్ళ కష్టం టీడీపీ వాళ్ళకి పనికొచ్చింది..!

Thursday, August 6th, 2020, 07:07:29 AM IST

మన ఏపీలో ఉన్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలకు కూడా వారికంటూ పని చేసే సోషల్ మీడియా విభాగాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మూడు పార్టీలలో కేవలం డబ్బులు ప్రధానంగా పని చేయని సోషల్ మీడియా విభాగం మాత్రం జనసేన అని చెప్పాలి.

అలాగే సోషల్ మీడియాలో స్ట్రాంగ్ బేస్ కూడా వైసీపీ తర్వాత వీరిదే అని చెప్పాలి. ఇదిలా ఉండగా ఇతర పార్టీలకు చెందిన నాయకుల తప్పొప్పులను ఎండగట్టడంలో వీరు కూడా ముందుంటారు. గతంలో టీడీపీ చేసిన తప్పులను ఎత్తి చూపిన వీరు ఇప్పుడు వైసీపీ విషయంలో కూడా చేస్తున్నారు. కానీ వారి కష్టాన్ని మాత్రం టీడీపీ అనుకూల మీడియా సహా సోషల్ మీడియా అంతా చాలా సింపుల్ గా వాడుకొని వారి క్రెడిట్ ను వీరు కొట్టేశారు.

వైసీపీ నేతలు ఎంతలా మాటలు మార్చారో అన్నదానికి సంబంధించి జనసేన సోషల్ మీడియా వారు తయారు చేసిన వీడియోను లోకేష్ సహా ఇతర టీడీపీ నేతలు లోగోలు చేరిపేసి పోస్ట్ చేయడం వారికి షాకిచ్చింది. అయితే ఇలాంటి ఘటనే ఇంతకు ముందు కూడా ఓసారి జరగగా టీడీపీ వారు పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు.