ఏపీ కరోనా లెక్కల మాయాజాలాన్ని కేంద్రం అందుకే పరిగణనలోకి తీసుకోలేదు.. !

Saturday, August 8th, 2020, 10:02:31 AM IST

AP_corona

గత కొంత కాలం నుంచి ఏపీలో కరోనా టెస్టులు భారీ సంఖ్యలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనితో ఈ టెస్టుల సంఖ్య విషయంలో ఏపీ నెంబర్ 1 స్థానంలో నిలిచింది అని రాష్ట్ర ప్రభుత్వం వారే అంటున్నారు. అయితే టెస్టులు పరంగా ఓకె అనుకున్నా వాటిని తగ్గించే విషయంలో మాత్రం విఫలం చెందింది. అయితే ఇప్పటికీ కూడా టెస్టుల పరంగా మాత్రమే నెంబర్ అని చెప్పుకుంటున్న ఏపీ ప్రభుత్వంపై నిజానికి అనుమానాలు లేకపోలేవు.

భారీ ఎత్తున టెస్టులు చెయ్యడం ఎలా సాధ్యం అవుతుంది అని ఏమన్నా బోగస్ లెక్కలు చెప్తున్నారా లేక అసలు టెస్ట్ చేయకుండానే చేస్తున్నామని అంటున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం వారు అవుననే షాకిచ్చారు. ఏపీ ప్రభుత్వం బోగస్ లెక్కలు చూపెట్టడం ద్వారానే అక్కడ అన్ని టెస్టులు చేసారని చెప్తున్నారని అంటున్నారు. ఇప్పుడు దీనికి సాక్ష్యంగా టీడీపీ సోషల్ మీడియా వారు ఓ మహిళ తన కుటుంబానికి ఎదురైన ఘటనను వివరిస్తున్న వీడియోను పెట్టి సంచలనం రేపారు.

అసలు టెస్టులు చెయ్యకుండా ఫలితం రావడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. దీనితో ఈ వీడియో ద్వారా..”కరోనా టెస్టుల్లో దేశంలోనే నంబర్ వన్ అని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంటే, కేంద్రం మాత్రం అసలు లెక్కలోకే తీసుకోవటం లేదు ఎందుకా అనుకున్నాం. ఇలాంటి బోగస్ టెస్టులు చేస్తుంటే, కేంద్రం ఎందుకు పరిగణలోకి తీసుకుంటుంది ? టెస్టులు చెయ్యకుండా, చేసినట్టు ప్రభుత్వం చెప్తుంటే ఎలా ?” అంటూ విమర్శలు కురిపించారు.