కొత్త జగన్నాటకానికి ఆర్కే తెర తీశారు – ధూళిపాళ్ల నరేంద్ర

Wednesday, March 17th, 2021, 01:00:34 PM IST

అమరావతి రాజధాని భూముల విషయం లో అధికార పార్టీ కి చెందిన వైసీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు అంటూ తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాజధాని లో ఎస్సీ ఎస్టీలకు ఎక్కడా కూడా అన్యాయం జరగలేదు అని వ్యాఖ్యానించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అంటూ మండిపడ్డారు. అమరావతి భూముల విషయం లో ఇన్ సైడర్ ట్రేడింగ్ కి అవకాశం లేదని హైకోర్ట్ తీర్పు ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. అసత్యాలు ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్తితి లేదని అన్నారు.

అయితే బాధితులు ఫిర్యాదు ఇవ్వకుండా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు అంటూ చెప్పుకొచ్చారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎస్సీ నా అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా నమోదు చేస్తారు అంటూ నిలదీశారు. కొత్త జగన్నాటకానికి ఆర్కే తెర తీశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి ఉద్యమం లో ఎస్సీ లు ముందుండి ఉద్యమం నడిపిస్తున్నారు అని, దేశంలో ఎక్కడ భూ సేకరణ జరిగినా ఆందోళనలు జరిగాయి అని అన్నారు. కానీ అమరావతి లో రైతులు స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు ఇచ్చారు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రతి పక్షం లో ఉన్నప్పుడు కానీ, అధికారం లోకి వచ్చిన రెండేళ్ల వరకూ జీవో 41 తప్పు అని చెప్పని వైసీపీ నాయకులు ఇవాళ విమర్శలు చేయడం దారుణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.